ప్రగతి భవన్లో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డి సమావేశం ముగిసింది. రెండు గంటలపాటు సాగిన భేటీలో పలు కీలక అంశాలు చర్చించినట్లు సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి తెలిపారు. చేవెళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభలో తెరాసలో చేరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో సబిత, తన ముగ్గురు కుమారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
చేవెళ్ల సభలో కారెక్కనున్న సబిత - KCR
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గులాబీ గూటికి చేరటం ఖరారైంది. తెరాస అధినేతతో సమావేశమైన సబిత... సుదీర్ఘ చర్చల తర్వాత ఈ విషయాన్ని ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ద్వారా ప్రకటించారు.
గులాబీ గూటికి సబిత కుటుంబం