తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ ఆడపడుచు కారెక్కుతోంది! - KCR

కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు వరుసగా హస్తాన్ని వీడి కారెక్కుతున్నారు. ఇప్పటికే రేగ కాంతారావు, ఆత్రం సక్కు, హరిప్రియ నాయక్​, చిరుమర్తి లింగయ్య గులాబీ కండువా కప్పుకుంటామని ప్రకటించారు. ఇక తాజాగా కాంగ్రెస్​ ఆడపడుచు సబితా ఇంద్రారెడ్డి కూడా గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

హస్తానికి సబిత కటీఫ్​..!

By

Published : Mar 13, 2019, 11:43 PM IST

Updated : Mar 14, 2019, 1:13 AM IST

హస్తానికి సబిత కటీఫ్​..!
మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​తో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు సాగిన భేటీలో పలు కీలక అంశాలు చర్చించారు. చేవెళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సబిత పెద్ద కుమారుడు కార్తీక్​రెడ్డి స్పష్టం చేశారు.

తెరాసకు బలమే..!
గులాబీ గూటికి చేరుతున్న కార్తీక్​రెడ్డికి చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సబిత కుటంబం చేరికతో తెరాసకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తిరుగులేనట్లేనని గులాబీ బాస్​ ధీమావ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం కృషి చేస్తున్న మాజీ మంత్రి మహేందర్​రెడ్డితో కలిసి పని చేయాలని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... తెరాస తరఫున మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సబితకు సూచించినట్లు తెలుస్తోంది.

Last Updated : Mar 14, 2019, 1:13 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details