Niranjan Reddy comments on Rythu Bandhu funds : సీఎం కేసీఆర్ ప్రకటించిన దాని ప్రకారం రైతుబంధు నిధుల జమ ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనలు పాటించాలని సూచించారు. రైతు బంధు నిధులు విడుదల చేయడం పట్ల సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు.. నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తొలిరోజు ఎకరాలోపున్న రైతులకు 642.52 కోట్ల రూపాయల నిధుల్ని రైతుబంధు కింద వారి ఖాతాల్లో జమ చేశారు. సుమారు 22లక్షల 55వేల 81మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.
- Harish Rao: రైతు బంధు ఇచ్చేవాళ్లు కావాలా.. కార్లతో తొక్కించిన పార్టీనా?: హరీశ్ రావు
- BANDI SANJAY: 'రైతు బంధు' పేరుతో సాగు పథకాలన్నీ ఎత్తేశారు
"రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. తొలిరోజు రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్లు నిధులు జమ చేశాం. 22.55 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ. ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాం. వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనలు రైతులు పాటించాలి"- నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి