తెలంగాణ

telangana

ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేత

By

Published : Apr 9, 2020, 8:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. ఈ నెల 15 తర్వాత రిజర్వేషన్లను ఆల్​లైన్​లో పెట్టగా... చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకున్నారు. లాక్​డౌన్ పొడిగించే అవకాశం ఉండటంతో... రిజర్వేషన్లు చేసుకున్న వారికి నగదు వెనక్కి ఇవ్వాలని ఆర్టీసీ భావిస్తోంది.

rtc-stopped-reservation-in-ap
ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేత

ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బస్సుల రాకపోకలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాకే... తిరిగి రిజర్వేషన్లు ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే చాలామంది ఈ నెల 15 తర్వాత ప్రయాణాలు చేసేందుకు రిజర్వేషన్లు చేసుకున్నందున... వారందరికీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో టికెట్ రుసుము ఆర్టీసీ వెనక్కి ఇచ్చేయనుంది. నగదును ప్రయాణికుల బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్‌లో చెల్లించనున్నారు.

ఇవీ చదవండి:రాష్ట్రంలో మూడోసారి కుటుంబ సర్వే: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details