తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ ఎండీకి టీఎంయూ సమ్మె నోటీస్

తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎంప్లాయిస్‌ యూనియన్లు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు అందజేశాయి. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి.

తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె సైరన్

By

Published : Sep 11, 2019, 2:17 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ నెల 25వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సమ్మెకు వెళతామని అయన హెచ్చరించారు. ఈ మేరకు బస్‌భవన్‌లోని ఆర్టీసీ ఇంఛార్జీ​ ఎండీ సునీల్‌శర్మకు సమ్మె నోటీసులు అందచేశారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఇప్పటికే టీజేఎంయూ, ఇయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్లు నోటీసులు అందజేశాయి. ఈ సమస్య జటిలం కాకుండా యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అశ్వద్ధామ పేర్కొన్నారు.

తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె సైరన్

ABOUT THE AUTHOR

...view details