తెలంగాణ

telangana

ETV Bharat / state

పుడింగ్‌ అండ్ మింక్ పబ్ కేసుపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిల్

పుడింగ్‌ అండ్ మింక్ పబ్ కేసుపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిల్
పుడింగ్‌ అండ్ మింక్ పబ్ కేసుపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిల్

By

Published : Apr 25, 2022, 8:13 PM IST

Updated : Apr 25, 2022, 8:49 PM IST

20:11 April 25

పుడింగ్‌ అండ్ మింక్ పబ్ కేసుపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిల్

Revanth Pil Filed in Highcourt: పుడింగ్‌ అండ్ మింక్ పబ్ కేసుపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల నిపుణులతో సిట్‌ ఏర్పాటు చేయాలని.. పబ్‌ డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నారని రేవంత్​ దాఖలు చేసిన పిల్​లో వివరించారు.

అసలేం జరిగిందంటే: ఏప్రిల్​ 3వ తేదీన హైదరాబాద్​ బంజారాహిల్స్ పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్‌లో అర్ధరాత్రి కొకైన్‌, గంజా, ఎల్‌ఎస్‌డీ మత్తు పదార్థాలు సేవిస్తూ పెద్ద ఎత్తున పార్టీ జరుగుతుందని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో డెకాయ్ ఆపరేషన్‌ నిర్వహించారు. పోలీసులను గుర్తించిన యువతీ యువకులు వారి వద్ద ఉన్న మత్తు పదార్థాలను కిటికీల గుండా బయట పారేసి కనిపించకుండా చేశారు. పక్కా సమాచారంతో ఉత్తర మండల, మధ్య మండల, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్‌ను చుట్టుముట్టారు.

పలువురు ప్రముఖుల కుమారులు, కుమార్తెలు: పబ్​లో ఉన్న యువతీ యువకులు, నిర్వాహకులు, సిబ్బందితో సహా మొత్తం 148 మందిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. వీరితో పాటు పబ్‌ సమీపంలో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నటి నిహారిక, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సహా పలువురు ప్రముఖుల కుమారులు, కుమార్తెలు ఉన్నారు. పోలీసు అధికారుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. వీరందరిని బంజారాహిల్స్ ఠాణాకు తరలించిన పోలీసులు వారి వివరాలను నమోదు చేసుకుని పంపించారు. ఈ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని రేవంత్​రెడ్డి హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 25, 2022, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details