Revanth Reddy wrote Letter to cm KCR : జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే దారుణంగా తయారైందని విమర్శించారు. ఈ మేరకు అయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు జూనియర్ కార్యదర్శుల కష్టంతోనే వచ్చాయనే విషయాన్ని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి డిమాండ్లు:
- జూనియర్ కార్యదర్శులు కోరుకుంటున్న విధంగా వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి.
- 4 సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి.
- కేడర్ స్ట్రెంట్‌తో పాటు సర్వీసును రూపొందించాలి.
- 010 పద్దు కింద వేతనాలిస్తూ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందజేయాలి.
- చనిపోయిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలి.
- ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలి.
- ప్రభుత్వ మహిళా పంచాయతీ కార్యదర్శులకు ఆరు నెలల ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలి.
పైన తెలిపిన వాటిని పరిష్కరించాలని అన్నారు. లేకపోతే వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచి, వారి తరఫున ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతుందని స్పష్టం చేశారు.