తెలంగాణ

telangana

ETV Bharat / state

'16 ఎంపీ స్థానాలు వస్తే కేసీఆర్ ప్రధాని అవుతారా?'

మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని రేవంత్​ రెడ్డి తెలిపారు. కీసర నుంచి మేడ్చల్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి

By

Published : Mar 22, 2019, 5:42 PM IST

నామినేషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి
మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కీసర జయమోహన్ గార్డెన్ నుంచి మేడ్చల్​ కలెక్టరేట్​ వరకు ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామ​ పత్రాలు అందజేశారు.

భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఎన్నికల కురుక్షేత్రం

దేశంలో భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఎన్నికల కురుక్షేత్రం జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. 16 ఎంపీ స్థానాలు వస్తే కేసీఆర్ ప్రధాని అవుతారని ఎంపీ కవిత అనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

మల్కాజిగిరిని ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా ఓట్లు ఎలా అడుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. తనను గెలిపిస్తే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:వ్యాపారవేత్తను ఢీకొట్టేందుకు మరో వ్యాపారవేత్త సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details