తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy Fires on Telangana Government : 'అభ్యర్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే.. డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తాం' - Revanth Reddy criticism of KTR

Revanth Reddy Fires on Telangana Government : నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 లక్షలమంది యువత ఆందోళనతో ఉన్నారని.. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మడం పూర్తిగా సర్కార్ వైఫల్యమని విమర్శించారు.

Revanth Reddy
Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 10:45 PM IST

Revanth Reddy Fires on Telangana Government :ప్రవల్లిక ఆత్మహత్యపై దర్యాప్తు అధికారి ప్రకటనను.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నమని ఆరోపించారు. నిజంగా 24 గంటల్లో ప్రవల్లిక ఆత్మహత్య కేసును పరిష్కరించి ఉంటే.. మరి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును నెలల తరబడి ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించారు. భావోద్వేగానికి గురై ప్రాణాలు తీసుకోవద్దని.. యువతకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. 32 లక్షల మంది యువత ఆందోళనతో ఉన్నారని చెప్పారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మడం పూర్తిగా సర్కార్ వైఫల్యమని దుయ్యబట్టారు. సింగరేణిలో నియామకాల విషయంలోనూ సరిగా వ్యవహరించలేదని విమర్శించారు. గ్రూప్‌-1, 2 పరీక్షల రద్దుతో అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్యలకు టీఎస్‌పీఎస్సీ అధికారులను బాధ్యులను చేయడం లేదని రేవంత్​రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy Fires on CM KCR : 'బీఆర్ఎస్ మరో 45 రోజులే.. ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం'

Revanth Reddy Comments on KCR : పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని రేవంత్​రెడ్డి అన్నారు. రెండు నెలలు ఓపిక పట్టాలని యువతను కోరుతున్నానని తెలిపారు. భావోద్వేగానికి గురై ప్రాణాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తామని పేర్కొన్నారు. ఇలాంటి ఆత్మహత్యలు ఉండకూడదంటే కేసీఆర్ (KCR) సర్కారు గద్దె దిగాలని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు తాము అండగా ఉంటామని రేవంత్​రెడ్డి చెప్పారు. అన్ని సమస్యలకు పరిష్కారం.. కేసీఆర్ గద్దె దిగడమేనని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిపాలన తీసుకొస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు చేసే తప్పుడు ప్రకటనలు విని మోసపోవద్దని సూచించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన వివరాలను రేపు చెబుతామని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థులపై నిన్న, ఇవాళ చర్చించామని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

War of Words Between Harishrao and Revanth Reddy : నువ్వా నేనా.. హరీశ్​రావు రేవంత్​రెడ్డి మధ్య మాటల యుద్ధం

"నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. 32 లక్షల మంది యువత ఆందోళనతో ఉన్నారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. సింగరేణిలో నియామకాల విషయంలోనూ సరిగా వ్యవహరించలేదు. గ్రూప్‌-1, 2 పరీక్షల రద్దుతో అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు టీఎస్‌పీఎస్సీ అధికారులను బాధ్యులను చేయడం లేదు."- రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy Fires on Telangana Government అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గద్దె దిగడమే

రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ను కలిశానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించానని.. పార్టీ గెలుపు కోసం పని చేస్తానని తెలిపినట్లు చెప్పారు. అధిష్ఠానం చెప్పిన చోట పోటీకి సిద్ధంగా ఉన్నానని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Revanth Reddy Fires on CM KCR : 'కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది'

Revanth Reddy on Congress MLA Candidates : ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చర్యలు తప్పవు: రేవంత్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details