Revanth Reddy on CM KCR : కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రయత్నాల్లో భాగంగానే తెరాస అధినేత, సీఎం కేసీఆర్ కొత్త ఫ్రంట్‌ను తెరపైకి తెస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. యూపీఏకు అనుకూలంగా ఉన్నవారితో రాజకీయం నెరపడం వెనుక ఉద్దేశం అదేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి మద్దతు పలికినట్లు కేసీఆర్ మాట్లాడటం రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకేనని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్రమోదీని ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, దేవగౌడతో కలిసి... నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి. అప్పుడే భాజపా ముక్త్ భారత్ ఏర్పడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీని బలహీన పరచడానికే సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు అనుకూలమైన పార్టీలతోనే కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. మమతా, స్టాలిన్‌ను కాంగ్రెస్‌కు దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే యూపీఏ, ఎన్డీయేతర సీఎంలతో చర్చించాలి.