హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలోని రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించారు. దేశాభివృద్ధికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రంలో తెరాస, భాజపా ఏకమై కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.40 వేల కోట్లు కుంభకోణం చేసినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌పై మూడు సీబీఐ కేసులున్నప్పటికీ కేంద్రం వాటిని ఎందుకు పక్కన పెట్టిందో చెప్పాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు వంత పాడుతూ, ప్రజల ముందు ఒకరినొకరు తిట్టుకొంటున్నట్లు ఇరుపార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్‌పై వెంటనే సీబీఐ విచారణ వేయించాలని రేవంత్ అన్నారు. తన వద్ద ఆధారాలున్నాయని వాటిని మీముందు ఉంచితే చర్యలు తీసుకుంటారా అని భాజపా నాయకులను ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మల్కాజిగిరి కాంగ్రెస్ ఇంఛార్జీ శ్రీశైలం గౌడ్, కుసుమ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
'కేసీఆర్‌పై సీబీఐ కేసులను ఎందుకు పక్కనపెట్టారు'
రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలు కూకట్‌పల్లిలోని రాజీవ్‌గాంధీ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు.
'ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటారా..?'