తెలంగాణ

telangana

ETV Bharat / state

సరకు రవాణాలో భారీ లాభాలు ఆర్జించిన ద.మ.రైల్వే

భారతీయ రైల్వేలోని అన్ని జోన్ల కంటే దక్షిణమధ్య రైల్వే మొట్టమొదటిసారిగా గరిష్ఠ స్థాయిలో సరకు రవాణా చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సరకు రవాణాలో క్రియాశీలక భాగస్వాములైన పరిశ్రమల అధికారులు, ప్రతినిధులతో సికింద్రాబాద్​లోని రైల్​ నిలయంలో సమావేశం నిర్వహించారు. జోన్​ అభివృద్ధికి కారకులైన అధికారులను సన్మానించారు.

railway-

By

Published : Apr 19, 2019, 11:46 AM IST

దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధిలో దూసుకెళ్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది 19 శాతం అధికంగా సరకు రవాణా చేసి రికార్డు నెలకొల్పింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 122.6 మిలియన్​ టన్నుల సరకు రవాణా చేసి రూ.10,955 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 31 శాతం ఉత్తమ ఇంక్రిమెంటల్​ లోడిరగ్​ నమోదు చేసి మరో కొత్త రికార్డు సాధించింది.

సరకు రవాణాలో భారీ లాభాలు ఆర్జించిన ద.మ.రైల్వే
బొగ్గు రవాణా వాటా 55 శాతం, సిమెంట్​ 23 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. సరకు రవాణాలో 39 శాతం, బొగ్గు రవాణాలో 71శాతం ప్రగతి నమోదు చేసింది. భవిష్యత్తులో సరకు రవాణాలో 136 మిలియన్​ టన్నుల మైలురాయిని చేరేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. జోన్​ అభివృద్ధికి కారకులైన పరిశ్రమల అధికారులను, సరకు రవాణా దారులను దక్షిణమధ్య రైల్వే జీఎం సన్మానించారు.

అధికారులను, వినియోగదారులను సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే దిశగా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రచిస్తోంది.


ఇదీ చదవండి: ప్రయాణికుల రద్దీలో సికింద్రాబాద్​ రైల్వే రికార్డ్​

ABOUT THE AUTHOR

...view details