Rahul Gandhi At Congress Vijayabheri Sabha :కాంగ్రెస్ మాటఇస్తే తప్పదన్న విషయాన్ని హస్తం నాయకులు తుక్కుగూడ విజయభేరి సభా వేదికగా నొక్కిచెప్పే ప్రయత్నం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలతో పాటు సీడబ్యూసీ సభ్యులు సభకు హాజరవగా.. రాష్ట్ర నేతలు భారీగా జనసమీకరణ చేశారు. ఓటర్లను ఆకర్శించేందుకు ఉత్ప్రేరకం లాంటి ఆరు హామీల గ్యారంటీ కార్డును కాంగ్రెస్ పార్లమెంటరీ అధ్యక్షురాలు సోనియా(Congress Parliamentary President Sonia) ప్రకటించారు.
Congress Six Guarantees in Telangana : తొలుత మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme) కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం కల్పిస్తామని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్లక్ష్యమని సోనియా స్పష్టం చేశారు. తమ వల్లే తెలంగాణ ఏర్పడిందని ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని మాట ఇస్తున్నట్లు ప్రకటించగా.. సభలో హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి. అనార్యోగ కారణాలతో త్వరగానే సభావేదిక నుంచి సోనియా నిష్క్రమించారు.
CWC Meeting Hyderabad 2023 : తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో విజయంపై సీడబ్ల్యూసీ ధీమా
'మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తాం. మహిళల కోసం రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తాం. తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు ఆరు వాగ్దానాలను ప్రకటిస్తున్నాం. ఇందులో మహాలక్ష్మీ మొదటిది. ఆ వాగ్దానాలను అమలు చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో నాసహచరులతో కలిసి నేను భాగస్వామినయ్యా. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కొత్త శిఖరానికి తీసుకెళ్లే బాధ్యత మాపై ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలనేది నా కల.' - సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Sonia Gandhi At Congress Vijayabheri Sabha 2023 :రాజకీయాల్లో ఎవ్వరితో కొట్లాడుతున్నామో కొట్లాడేపార్టీకి తెలిసి ఉండాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్‌తో రాజీలేని పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ మూడు వేరువేరుగా కనిపించినా కలిసే పనిచేస్తాయని ఆరోపించారు. బీజపీకు అవసరమైనపుడల్లా బీఆర్ఎస్ సహకరించిందని విమర్శించారు. సోనియా ప్రకటించిన ఆరు హామీల గ్యారంటీ కార్డును( Telangana Congress Six Guarantees) తప్పక నెరవేరుస్తామన్న ఆయన.. రాష్ట్ర ఏర్పాటును ఉదాహరించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. కాళేశ్వరంతో లక్ష కోట్లు, ధరణి పోర్టల్‌తో పేదల భూములు కేసీఆర్ లాకున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. రైతుబంధు ధనిక రైతులకు ఉపయోగపడుతోందని ఆక్షేపించారు.