New Year Restrictions in Hyderabad: 'ప్రజలకు విజ్ఞప్తి.. రేపు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండండి' - హైదరాబాద్‌లో ఆంక్షలుట
13:22 December 30
నూతన సంవత్సర వేడుకలపై రాచకొండ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు
New Year Restrictions in Hyderabad: కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారా? అయితే... ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. నూతన సంవత్సర వేడుకలపై రాచకొండ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు విధించారు. సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. రేపు రాత్రి 11 గంటల నుంచి ఓఆర్‌ఆర్‌పై కార్లకు అనుమతి నిరాకరించారు.
traffic police erestrictions on new year celebrations: ఎల్లుండి ఉ.5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌పై కార్లకు అనుమతి లేదు. ఓఆర్‌ఆర్‌పై లారీలు, గూడ్స్ వాహనాలకు మాత్రమే అనుమతినిచ్చారు. టికెట్లు ఉన్నవారికే ఓఆర్‌ఆర్‌పై నుంచి విమానాశ్రయానికి అనుమతి ఉంది. రేపు రాత్రి 10 నుంచి ఉ.5 గంటల వరకు పైవంతెనలు మూసివేస్తున్నట్లు తెలిపారు. క్యాబ్ డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే రద్దు చేయకూడదని అన్నారు. క్యాబ్ సర్వీస్‌ను రద్దు చేస్తే రూ.500జరిమానా విధించనున్నట్లు తెలిపారు. వాట్సాప్ నంబరు 9490617111 కి ఫిర్యాదు చేయొచ్చుని తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకలకు ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలివే...
- సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలి
- రేపు రాత్రి 11 గంటల నుంచి ఓఆర్‌ఆర్‌పై కార్లకు అనుమతి నిరాకరణ
- ఎల్లుండి ఉ.5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌పై కార్లకు అనుమతి నిరాకరణ
- ఓఆర్‌ఆర్‌పై లారీలు, గూడ్స్ వాహనాలకు మాత్రమే అనుమతి
- టికెట్లు ఉన్నవారికే ఓఆర్‌ఆర్‌పై నుంచి విమానాశ్రయానికి అనుమతి
- రేపు రాత్రి 10 నుంచి ఉ.5 గంటల వరకు పైవంతెనలు మూసివేత
- క్యాబ్ డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలి
- రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే రద్దు చేయకూడదు
- క్యాబ్ సర్వీస్‌ను రద్దు చేస్తే రూ.500జరిమానా
- వాట్సాప్ నంబరు 9490617111 కి ఫిర్యాదు చేయొచ్చు.