అన్ని గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్. దీనిపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ఆహారశుద్ధి పరిశ్రమలను మూడు దశల్లో ప్రోత్సహిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రూ. 50కోట్లతో మిర్చికి సంబంధించిన ఆహారశుద్ధి పరిశ్రమ నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమికదశలో రైతుల సహకారంతో... తరువాత దశల్లో... ప్రైవేట్ పెట్టుబడి దారులను ఆహ్వానించి 25 క్లస్టర్లుగా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పండే పంటలను బట్టి పరిశ్రమలను నెలకొల్పనున్నట్లు తెలిపారు.
మూడు దశల్లో ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం: కేటీఆర్
గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఆహారశుద్ధి పరిశ్రమలను మూడు దశల్లో ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.
మూడు దశల్లో ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సహం: కేటీఆర్
Last Updated : Sep 20, 2019, 11:34 AM IST