తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా సాయమందించాలి' - ప్రైవేటు నర్సింగ్​ హోం అసోషియేషన్​

రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నందున ప్రైవేటు ఆస్పత్రులు సామాజిక బాధ్యతగా ఆలోచించి సహాయం అందించేందుకు ముందుకు రావాలని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్​ హోం అసోసియేషన్​ నాయకులు కోరారు. ప్రజలకు ప్రైవేటు వైద్య శాలల్లో రోజూ 2 గంటలు ఉచితంగా ఓపీ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

pritvate nursing homes

By

Published : Sep 10, 2019, 10:07 PM IST

రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాల నేపథ్యంలో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోం అసోసియేషన్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో అసోషియేషన్​ నాయకులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా ప్రైవేటు వైద్యులు ఉచిత వైద్యం చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మంది జ్వరాల బారిన పడడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ప్రైవేటు వైద్య శాలల్లో రోజూ 2 గంటలు ఉచితంగా ఓపీ సేవలు అందించాలని కోరారు. అలాగే ల్యాబ్​ టెస్టుల్లో డిస్కౌంట్​ ఇచ్చి ప్రజలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

'ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా సాయమందించాలి'

ABOUT THE AUTHOR

...view details