తెలంగాణ

telangana

రాత్రికి రాత్రే సచివాలయాన్ని ఎందుకు కూల్చినట్టు: పొన్నం

By

Published : Jul 7, 2020, 3:29 PM IST

కరోనా వంటి సంక్షోభ సమయంలో సచివాలయం కూల్చివేత నిర్మాణం తగునా అంటూ... పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఎక్కడున్నారంటూ ప్రజలంతా ఆరా తీస్తుంటే... మీరు మాత్రం సచివాలయం పనులు చేయడం సరికాదంటూ మండిపడ్డారు.

ponnam-prabhakar-on-demolition-of-telangana-secretariat
'సచివాలయం కూల్చివేతకు ఇది సరైన సమయం కాదు'

రాత్రికి రాత్రే సచివాలయం కూల్చే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏంటని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

''సీఎం కేసీఆర్‌కు నూతన సచివాలయం కట్టుకోవాలన్న ఆలోచన... తపన ఉంటే దానికో సమయం సందర్భం ఉంటుంది. ప్రపంచమంతా కరోనా బారినపడి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి పనులు చేయడం తగునా..? ఉద్యోగస్తులకు పూర్తి జీతాలు చెల్లించేందుకు పైసలు లేవు కానీ... సచివాలయం నిర్మించేందుకు ఉన్నాయా? ఈ సంక్షోభ సమయంలో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా?''

-పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

'సచివాలయం కూల్చివేతకు ఇది సరైన సమయం కాదు'

వెంటనే కూల్చివేతను ఆపి... కరోనా పట్ల మరింత శ్రద్ధ వహించాలని పొన్నాం ప్రభాకర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details