వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన బంద్కు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి సంఘీభావం ప్రకటించారు. రైతుల ఆందోళన న్యాయ సమ్మతమైనదేనని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే చట్టాలను వెంటనే రద్దు చేయాలని మూర్తి డిమాండ్ చేశారు. రైతును రాజులాగా బతకనివ్వాలని, కార్పొరేట్ సంస్థల వద్ద బానిసగా మార్చకూడదని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు.
రైతు బంద్కు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి మద్దతు
భారత్ బంద్కు పీపుల్స్ స్ఠార్ ఆర్.నారాయణ మూర్తి మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతు బంద్కు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి మద్దతు
రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి చేపడుతున్న పథకాలను ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అమలు చేయాలని, ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని నారాయణమూర్తి కోరారు.
ఇదీ చూడండి:రైతన్నకు మద్దతుగా నిలిచిన రాష్ట్రం.. భారత్ బంద్ సంపూర్ణం