తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​లో ఎస్సీలకు రక్షణ లేదు: పీసీసీ అధికార ప్రతినిధి - పీసీసీ క్రమశిక్షణ సంఘం

తనపై భౌతిక దాడి జరిపిన నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణను తక్షణమే పదవి నుంచి తొలిగించాలని పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎస్సీలకు రక్షణ లేదనడానికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు.

pcc spokesperson demands immediate removal of nagarkurnool dcc president
'కాంగ్రెస్‌ పార్టీలో ఎస్సీలకు రక్షణ లేదనిపిస్తోంది'

By

Published : Dec 31, 2020, 2:44 PM IST

తనపై జరిగిన భౌతిక దాడికి నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ కారణమంటూ పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్‌ ఆరోపించారు. అతనిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ కోదండ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

తాను చేసే సేవా కార్యక్రమాలను చూసి ఓర్వలేకే.. వంశీకృష్ణ తన అనుచరులతో తనపై దాడి చేయించారని మండిపడ్డారు సతీశ్. భౌతికదాడులు చేస్తే.. చూస్తూ సహించేది లేదని పేర్కొన్నారు.

తక్షణమే వంశీకృష్ణను పదవి నుంచి తొలిగించి, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని సతీశ్ డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయంతో.. జనాభా ప్రాతిపాదికన ఎస్సీలకు రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి:సీఐటీయూ ఆధ్వర్యంలో ఎస్సీలు, ముదిరాజుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details