తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యోగులకు జీతాలు లేవు కానీ... కూల్చివేతకు డబ్బులు ఉన్నాయా?' - సచివాలయం కూల్చివేతను వ్యతిరేకించిన కాంగ్రెస్ నేతలు

కరోనాతో ప్రజలు చనిపోతుంటే... ముఖ్యమంత్రి పట్టించుకోకుండా నూతన సచివాలయం నిర్మించడాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డి తప్పుబట్టారు. వైరస్‌తో జనం అల్లాడుతుంటే ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేత అవసరమా అంటూ మండిపడుతున్నారు.

pcc-leader-uttam-kumar-reddy-on-demolition-of-telangana-secretariat
'ఉద్యోగులకు జీతాలు లేవు కానీ... కూల్చివేతకు డబ్బులు ఉన్నాయా?'

By

Published : Jul 7, 2020, 12:52 PM IST

ముఖ్యమంత్రి ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి... ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వలేమంటున్న ప్రభుత్వం సచివాలయం కూల్చివేయడమేంటని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఇంతటి దుర్భర పరిస్థితులుంటే కేసీఆర్​ వైద్యంపైన సమీక్షలు కూడా చేయకుండా... ఎక్కడో చీకటిలో ఉన్నారంటూ విమర్శించారు. పాత సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా ఏర్పాటు చేయమని కోరినా... మా మాటలు పెడచెవిన పెడుతూ... సీఎం తన మొండి వైఖరితో కూల్చివేతలు ప్రారంభించారు. ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొనాలి... ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు.

ఇదీ చదవండి:ఎక్కువ సేపు కూర్చుంటే క్యాన్సర్‌ వస్తుందట..!

ABOUT THE AUTHOR

...view details