తెలంగాణ

telangana

ETV Bharat / state

'మీ అందరి గుండె చప్పుడు బలంగా ఉంటే నీనే సీఎంగా ఉంటా' - వైసీపీ ప్రభుత్వంపై పవన్​ కల్యాణ్​ ఫైర్​

Pawan Kalyan Fire on YSRCP: ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేయడమే జనసేన ముందున్న లక్ష్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తేల్చిచెప్పారు. వారాహి వాహనాన్ని ఆపేందుకు సీఎం జగన్​తో సహా ఎవరొస్తారో రావాలని సవాల్‌ విసిరారు. మంత్రి అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విరుచుకుపడ్డారు.

Pawan Kalyan Fire on YSRCP
Pawan Kalyan Fire on YSRCP

By

Published : Dec 18, 2022, 5:30 PM IST

Updated : Dec 18, 2022, 5:45 PM IST

Pawan Kalyan Fire on YSRCP: ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలోనూ.. రైతులు సంతోషంగా లేరని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదన్నారు. అన్నదాతల కష్టాలను పట్టించుకునే అధికారులు కరవయ్యారన్న ఆయన.. ప్రజలను బెదిరించటానికి, ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికే వస్తారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్న పవన్ వైకాపా నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎన్నికలు దగ్గరికి వస్తున్నందునే అవినీతికి వైకాపా హాలీడే ప్రకటించిందని ఆరోపించారు. తనను వారాంతపు రాజకీయ నేత అంటూ కాపు నాయకులతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. వారానికి ఒక్కరోజు వస్తేనే... వైకాపా వాళ్లు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. తనకు తాతలు సంపాదించి పెట్టిన వేల కోట్లు లేవనీ.. అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు తన వద్ద లేదని పేర్కొన్నారు. తన కష్టార్జితంతోనే కౌలు రైతులకు సాయం చేస్తున్నానని పవన్‌ తెలిపారు. ఇదే సమయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అని విమర్శించారు.

పోలవరం పూర్తి చేయటం తెలియని ఆయన.. నీటిపారుదల మంత్రి అని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవడం లేదన్న పవన్‌ గెలవనిబోమని పేర్కొన్నారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వబోననే మాటకు కట్టుబడి ఉన్నానన్న పవన్‌ భాజపా, తెలుగుదేశం పార్టీలకు అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదన్నారు. వైకాపా నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ము నుంచి కమిషన్లు కొట్టే రకం కాదని, అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని తెలిపారు.

"వైసీపీ నాయకులు నిన్న అన్నారు.. వచ్చే ఎన్నికలు కుల యుద్ధం కాదు క్లాష్​ యుద్ధం అని.. అంటే లేని వర్గాలు ఉన్నత వర్గాలకు యుద్ధం అని.. నాతో పోల్చుకుంటే వైసీపీ నాయకుల ఆస్తులు ఎంత నా ఆస్తి ఎంత చూడాలి. వచ్చే ఎన్నికల్లో అక్రమార్కులు దోపిడి దారులు రాజ్యం ఏలాలి అని చూస్తే నాకు ఉన్న ఒకే ఒక ఆప్సన్​.. ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలిపి ముందుకు తీసుకువెళ్లడం.. దాంట్లో మీ అందరి గుండె చప్పుడు బలంగా ఉంటే నీనే సీఎంగా ఉంటాను. లేకుంటే వేరే వాళ్లను నియమిద్దాం. నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకునే అడిగే అధికారం మీకు ఇస్తున్నా."- పవన్​ కల్యాణ్​, జనసేన అధ్యక్షుడు

Pawan Kalyan Fire on YSRCP

ఇవీ చదవండి

Last Updated : Dec 18, 2022, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details