తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులను పరామర్శించనున్న జనసేనాని

పవన్​కల్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో పవన్ పర్యటన సాగనుంది. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు.

pawan-kalyan-for-krishna-district-on-wednesday in ap
రైతులను పరామర్శించనున్న జనసేనాని

By

Published : Dec 2, 2020, 7:43 AM IST

జనసేన అధ్యక్షులు పవన్​కల్యాణ్ ఏపీలోని కృష్ణా జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం రైతులను కలిసి మాట్లాడతారు. జిల్లాలోని ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో పవన్ పర్యటన సాగుతుంది. ఎక్కువగా నష్టపోయిన దివిసీమ ప్రాంతంలో పవన్ పర్యటిస్తారు. చల్లపల్లి మండలంలోని పాగోలులో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వనున్నారు.

ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. రైతులతో సమావేశం అవుతారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలు, పలు కీలక అంశాలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండీ:గ్రేటర్​ మేయర్​ పీఠంపై అందరి దృష్టి!

ABOUT THE AUTHOR

...view details