తెలంగాణ

telangana

ETV Bharat / state

జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన పవన్

హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయంలో 74వ స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు సుమాంజలి అర్పించారు.

pawan-kalyan-flag-hosting-at-hyderabad-janasena-party-office
జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన పవన్

By

Published : Aug 15, 2020, 11:36 AM IST

74వ స్వాతంత్య్ర వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ పార్టీ ముఖ్య నేతలు షేక్ రియాజ్, వై.నగేష్, అధ్యక్షుల తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details