తెలంగాణ

telangana

Passenger Rush in Hyderabad : పండుగ తెచ్చిన రద్దీ.. కిక్కిరిసిపోతున్న ప్రయాణ ప్రాంగణాలు..

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 12:21 PM IST

Updated : Oct 22, 2023, 1:56 PM IST

Passenger Rush in Hyderabad : సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడిపోతున్నాయి. ప్రధాన బస్‌స్టేషన్లు జేబీఎస్, ఎంజీబీఎస్‌లలో.. అలాగే ప్రధాన రైల్వేస్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లిలో ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం 5,500ల ప్రత్యేక బస్సులను, దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సుమారు 150కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నాయి. వీటితో పాటు సొంత వాహనల్లోనూ ప్రయాణికులు బయలుదేరి వెళ్తున్నారు.

passenger Rush in Hyderabad
passenger Rush in Hyderabad

Passenger Rush in Hyderabad :హైదరాబాద్‌లో ప్రయాణికులతో ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు సందడిగా మారాయి. బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకునేందుకు ప్రజలు సొంతూళ్లకు తరలి వెలుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 5,500 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైన ప్రత్యేక బస్సులు ఈనెల 25 వరకు అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో ఈసారి సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నారు.

Dasara rush in BusStations and Railway Stations at telangana : బతుకమ్మ, దసరా (Dasara) రోజుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో.. అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్‌లో ప్రధాన బస్‌స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. వీటితో పాటు కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్‌ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్​​.. సాధారణ చార్జీలతోనే స్పెషల్ బస్సులు

TSRTC Special Buses For Dasara Festival : పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్,.. ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంటుందని టీఎస్ఆర్టీసీ (TSRTC) వెల్లడించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి.. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయని తెలిపింది.

Thefts in Hyderabad During Dussehra : పండక్కి ఊరెళ్తున్నారా.. దొంగలు ఊడ్చేస్తారు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వరంగల్, హనుమకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి.. ఉప్పల్ బస్టాండ్ నుంచి.. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయని టీఎస్‌ ఆర్టీసీ తెలిపింది. ఏపీకి వెళ్లే బస్సులు కొన్నింటిని జేబీఎస్ నుంచి కూడా నడిపిస్తున్నట్లు పేర్కొంది. రైళ్లు, బస్సులతో పాటు ప్రజలు ప్రైవేట్ వాహనాల్లోనూ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మరికొంతమంది సొంత వాహనాల్లోనూ వెళ్తున్నారు. దీంతో నగర రోడ్లు ఖాళీగా, రహదారులు రద్దీగా మారాయి.

సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో (Passenger Rush) ప్రధాన రైల్వేస్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు సందడిగా మారిపోయాయి. దసరా సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే 143 ప్రత్యేక సర్వీసులను నడిపిస్తుంది.

  • సికింద్రాబాద్-నర్సాపూర్, హైదరాబాద్-కటక్, సికింద్రాబాద్-సంత్రగచ్చి, సికింద్రాబాద్-కాకినాడ, సికింద్రాబాద్-తిరుపతి
  • సికింద్రాబాద్ -మచిలీపట్నం, కాజీపేట-తిరుపతి, అకోలా-తిరుపతి, హైదరాబాద్ -నర్సాపూర్, విజయవాడ- నాగర్‌సోల్
  • లింగంపల్లి-కాకినాడ, సికింద్రాబాద్-గోరఖ్‌పూర్, సికింద్రాబాద్ -రాక్సోల్, సికింద్రాబాద్ -అగర్తాల
  • సికింద్రాబాద్-జైపూర్, సికింద్రాబాద్ -దానాపూర్, కాచిగూడ-నాగర్‌సోల్, సికింద్రాబాద్-విశాఖపట్టణం
  • తిరుపతి-విశాఖపట్టణం, తిరుపతి -షిర్డీ, సికింద్రాబాద్-రామేశ్వరం, జాల్నా-తిరుపతి రూట్లలో ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 28 వరకు ఇవి అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు 208 ట్రిప్పులను నడిపించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఎస్‌ఎంవీటీ బెంగళూరు- సత్రగచ్చి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్, ఎర్నాకులం-దన్‌బాద్ ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు.

Passenger Rush in Hyderabad పండుగ తెచ్చిన రద్దీ కిక్కిరిసిపోతున్న ప్రయాణ ప్రాంగణాలు

దసరాకి ఊరెళ్తున్నారా... దొంగలతో జర భద్రం!

TSRTC Special Buses For Dussehra Festival : దసరా స్పెషల్.. 13వ తేదీ నుంచి 5,265 ప్రత్యేక బస్సులు

Last Updated : Oct 22, 2023, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details