తెలంగాణ

telangana

ఘనంగా పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు

By

Published : Jun 10, 2021, 6:16 PM IST

పైడిమర్రి వెంకటసుబ్బరావు ప్రతిజ్ఞ ద్వారా ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని పెంపొందించారని ఎక్సైజ్​, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రతిజ్ఞ రూపకర్త, తెలంగాణ ముద్దుబిడ్డ పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 

పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు
పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు

ప్రతిజ్ఞ రూపకర్త, తెలంగాణ ముద్దుబిడ్డ పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

జాతీయ సమైక్యత, సమగ్రతను, దేశ వారసత్వ సంపదను కాపాడుకొని, ప్రతి ఒక్కరినీ గౌరవించి, సహోదరులుగా మెలగాలని తన రచన ద్వారా ప్రబోధించారన్నారు. నల్గొండ జిల్లా అన్నపర్తికి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు అందరికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన మహనీయులు, కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, చరిత్రకారులు, సామాజిక వేత్తలను
గౌరవించి, వారి జయంతి, వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:Suicide: పెళ్లైన రెండు వారాలకే యువతి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details