తెలంగాణ

telangana

ETV Bharat / state

మలక్​పేటలో ఉల్లి@170 - onion price one hundred and seventy rupees at malakpeta in hyderabad

హైదరాబాద్​ మలక్​పేటలో ఉల్లి ధర రూ. 150కి చేరింది. టోకు ధరల్లో అయితే వర్తకులు 170 రూపాయలకు అమ్ముతున్నారు. ఈసారి కేవలం 20 లారీల ఉల్లి మాత్రమే మార్కెట్​కు వచ్చిందని హైదరాబాద్​ ఆనియన్​ అసోసియేషన్​ తెలిపింది.

మలక్​పేటలో ఉల్లి@170
మలక్​పేటలో ఉల్లి@170

By

Published : Dec 6, 2019, 12:40 PM IST


హైదరాబాద్‌లో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మలక్​పేట హోల్ సేల్ మార్కెట్‌లో కిలో గ్రేడ్ వన్ ఉల్లి ధర 150 రూపాయలకు పైగా చేరింది. టోకు ధరల్లో వర్తకులు 170 వరకు విక్రయిస్తున్నారు. రెండో గ్రేడ్ ఉల్లి ధర 100 నుంచి 140 రూపాయల వరకు పలుకుతోంది.

సాధారణంగా మలక్‌పేట్‌ మార్కెట్‌కు 40 నుంచి 60 లారీల ఉల్లి దిగుమతి అవ్వగా... ప్రస్తుతం కేవలం 20 లారీలు మాత్రమే వస్తున్నట్లు హైదరాబాద్ ఆనియన్ అసోసియేషన్ తెలిపింది. ఈ స్థాయిలో ధరలను ఇప్పటి వరకూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిపోతున్న ధరలతో ఉల్లి కొనలేని పరిస్థితి నెలకొందని వినియోగదారులు వాపోతున్నారు.

మలక్​పేటలో ఉల్లి@170

ఇవీ చూడండి: జనం కంట కన్నీరు... ఎందుకీ 'ఉల్లి'కిపాటు?

ABOUT THE AUTHOR

...view details