MUSARAMBHAG BRIDGE: హైదరాబాద్‌లోని కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిచడంతో మూసారాంబాగ్ వంతెన ధ్వంసం అయింది. ధ్వంసమైన వంతెనపైన జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. పూర్తిగా బురద, రాళ్లు పేరుకుపోవడంతో వాటిని తొలగిస్తున్నారు. వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. రెండు వైపులా ఎవ్వరినీ వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎటు చూసిన రాళ్లు, బురద.. మూసారాంబాగ్ వంతెనకు మరమ్మతులు..
MUSARAMBHAG BRIDGE: హైదరాబాద్లో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించటంతో ధ్వంసమైన మూసారాంబాగ్ వంతెనపైన అధికారులు మరమ్మతులు చేపట్టారు. పూర్తిగా బురద, రాళ్లు పేరుకుపోవడంతో వాటిని తొలగిస్తున్నారు.
ముసారాంబాగ్ వంతెన
వరద ప్రవాహానికి రోడ్డు బాగా దెబ్బతిందని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్ తెలిపారు. సాయంత్రం లోగా పనులను పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే వాహనాలను గోల్నాక దగ్గర మళ్లిస్తున్నారు.
Last Updated : Jul 28, 2022, 2:49 PM IST