తెలంగాణ

telangana

ETV Bharat / state

నుమాయిష్​కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - numaish exhibition hyderabad 2019 for Special Busses

హైదరాబాద్​ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ ప్రారంభమైయింది. దీనిని వీక్షించేందుకు దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. దీనికోసం గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

numaish exhibition hyderabad 2019 for Special Busses
నుమాయిష్​కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

By

Published : Jan 3, 2020, 4:21 AM IST

Updated : Jan 3, 2020, 7:49 AM IST

నుమాయిష్ కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నుమాయిష్​ను వీక్షించేందుకు వచ్చిన సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 15 వరకు బస్సులు నడిపించనున్నట్లు వెల్లడించారు.

సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎగ్జిబిషన్​కు వచ్చిన సందర్శకుల రద్దీ తగ్గే వరకు నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పనిదినాల్లో 150 బస్సులను, సెలవు రోజుల్లో 200ల బస్సుల వరకు నడపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

నుమాయిష్​కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఇవీ చూడండి: ఇక అన్ని రకాల రైల్వే సేవలకు ఒకటే నంబర్

Last Updated : Jan 3, 2020, 7:49 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details