అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, భారతితో సహా కంపెనీలకు ఊరట లభించింది. సీబీఐ కేసు ఆధారంగా ఈసీఐఆర్ దాఖలు చేసిన ఈడీ 2016 జూన్ 29న భారతి సిమెంట్స్‌తో సంబంధం ఉన్న ఆస్తులు, డిపాజిట్‌లు, వాటాలను మొత్తం రూ.746.17 కోట్లను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జగన్, ఆయన గ్రూపు కంపెనీలకు చెందిన రూ.569.57 కోట్లు, భారతికి చెందిన రూ.22.31 కోట్లు, భారతి సిమెంట్స్, దాని గ్రూపునకు చెందిన రూ.154.29 కోట్లను జప్తు చేసింది. ఈ జప్తును సమర్థిస్తూ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ 2016 నవంబరు 23న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ జగన్, భారతితో పాటు జగన్ గ్రూపు కంపెనీలన్నీ 14 అప్పీళ్లను దాఖలు చేశాయి. వీటిపై విచారించిన అప్పీలేట్ అథారిటీ భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్‌మోహన్ రెడ్డి వ్యవహారంలో విడిగానూ మిగిలిన 13 అప్పీళ్లపై ఒకే ఉత్తర్వును జారీ చేసింది.
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ కంపెనీలకు ఊరట
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భారతి సిమెంట్స్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ జప్తు చేసిన రూ.746.17 కోట్లకు సంబంధించి అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను అప్పీలేట్ అథారిటీ సవరించింది. బ్యాంకు డిపాజిట్‌లకు సంబంధించి రూ.192 కోట్లకు బ్యాంకు గ్యారంటీని తీసుకుని విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది. మిగిలిన ఆస్తులపై జప్తును తొలగించాలంటూ ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.
ఆస్తులపై జప్తును ఎత్తివేయాలని ఈడీని ఆదేశించింది. కేసు తేలేదాకా రూ.192 కోట్లకు బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని జగన్, తదితరులను ఆదేశించింది. బ్యాంక్ గ్యారంటీ సమర్పించాక తక్షణం సొమ్మును విడుదల చేయాలని ఈడీని ఆదేశిస్తూ అడ్జ్యుడికేటింగ్ ఉత్తర్వులను సవరించింది. సీబీఐ చేసిన ఆరోపణలపై అథారిటీ ఎలాంటి అభిప్రాయాన్ని వెలువరించడం లేదని, అది చట్టప్రకారం విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించింది. ఈ ఉత్తర్వులు కేసు పూర్వాపరాలతో సంబంధం లేదని, కేవలం జప్తునకు సంబంధించింది మాత్రమేనని పేర్కొంది.
ఇదీ చదవండి: దివాలా చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం