తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలు తీసిన కార్పొరేట్.. నిర్లక్ష్యానికి పరాకాష్ఠ..

ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చిన్న జ్వరం వచ్చినా అన్ని పరీక్షలు చేస్తూ... డబ్బులు దండుకోవడం ఒక వైపైతే... ఎంత పెద్ద రోగం వచ్చిన పోనీలే అన్నట్లుగా వదిలేయడం మరో వైపు. ఈ ప్రైవేటు ఆస్పత్రుల పుణ్యమా అని ఆరేళ్లు కూడా నిండని పసిదానికి కాలే కోల్పోయింది.

కాలు తీసిన కార్పొరేట్.. నిర్లక్ష్యానికి పరాకాష్ఠ..

By

Published : Jun 3, 2019, 6:49 PM IST

Updated : Jun 3, 2019, 8:17 PM IST

హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, పావని దంపతుల ఒక్కగానొక్క కూతురు. పేరు అక్షర. ఈనెల 13న ఇంట్లో ఆడుకుంటూ ఉండగా... కబోర్డు పాప కాళ్ళపై పడింది. తీవ్రగాయమై రక్తస్రావమైంది. వెంటనే తల్లిదండ్రులు సనత్ నగర్​లో ఉన్న నీలిమ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మీ పాపకి పెద్ద ప్రమాదమేమీ జరగలేదు, మేము ఇలాంటి కేసులు చాలా చూసాం చికిత్స చేస్తామని చెప్పారు. మరుసటి రోజు పాపకి ఆపరేషన్ చేయాలని చెప్పారు.

తీరా ఆపరేషన్ చేసే సమయానికి చేతులెత్తేశారు. మా వల్ల కాదు పాపని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. చేసేదేం లేక తల్లిదండ్రులు చాలా ఆస్పత్రులు చుట్టూ తింపినా... పాపని ఎవరూ చేర్చుకోలేరు. చివరకు సికింద్రాబాద్​లోని కిమ్స్​కు తీసుకెళ్లగా... పాపకు ఇన్ఫెక్షన్ సోకిందని కాలు తీసేయాలని చెప్పారు. లేనిపక్షంలో పాప ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో తల్లిదండ్రులు సరేనన్నారు. ఎట్టకేలకు శస్త్రచికిత్స చేసి పాప కాలును తీసివేశారు.

ఆడుకోవాల్సిన వయసులో అవిటిదవడానికి కారణం నీలిమ ఆస్పత్రి వైద్యల నిర్లక్ష్యమేనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప కాలు పోవడానికి కారణమైన వారికి కఠిన శిక్ష విధించాలని, నీలిమ ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తండ్రి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సనత్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ... వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆస్పత్రి యాజమాన్యంతో పోలీసులు చేతులు కలిపారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెబుతున్నారు పాప తల్లిదండ్రులు.

కాలు తీసిన కార్పొరేట్.. నిర్లక్ష్యానికి పరాకాష్ఠ..

ఇవీ చూడండి: హైదరాబాద్​ను కమ్మేసిన కారుమబ్బులు... పలు చోట్ల వర్షం

Last Updated : Jun 3, 2019, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details