జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు హైదరాబాద్ తొలిసారి వేదిక కానుంది. నవంబర్ 21నుంచి 24 వరకు ఎల్బీస్టేడియలో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు ట్రేడిషనల్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి 800 మంది క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. మహిళా, పురుషుల విభాగాలు వేరువేరుగా జరుగుతాయని వివరించారు. కార్యక్రమాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారని వారు పేర్కొన్నారు.
మహానగరంలో తొలిసారి జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలు - ట్రేడిషనల్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ
హైదరాబాద్ నగరం జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు తొలిసారిగా వేదిక కానుంది. దేశవ్యాప్తంగా 800మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గోనున్నారని ట్రేడిషనల్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు తెలిపారు.
మహానగరంలో తొలిసారి జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలు