తెలంగాణ

telangana

ETV Bharat / state

జగన్మోహన్‌రెడ్డిది జేసీబీ ప్రభుత్వం: నారా లోకేశ్​ - Nara Lokesh visited ippatam

Nara Lokesh: ఏపీ ఇప్పటంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని ధైర్యమిచ్చారు.

జగన్మోహన్‌రెడ్డిది జేసీబీ ప్రభుత్వం: నారా లోకేశ్​
జగన్మోహన్‌రెడ్డిది జేసీబీ ప్రభుత్వం: నారా లోకేశ్​

By

Published : Nov 9, 2022, 10:59 PM IST

Nara Lokesh Ipptam Tour: ఏపీ గుంటూరు జిల్లా ఇప్పటంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ధ్వంసం చేసిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. మొత్తం 50కి పైగా ఇళ్లు ధ్వంసం అయితే వాటిలో 8ఇళ్లకు.. వైకాపా నేతలు తమకు ఎవరి సానుభూతి అవసరం లేదంటూ బ్యానర్లు కట్టారు. డబ్బులిచ్చి అబద్దాలను నిజం చేయకండని ఆ బ్యానర్లలో రాసి ఉంది. లోకేశ్​ ఇప్పటం రావటంతో పోలీసులు భారీగా మోహరించారు.

జగన్మోహన్‌రెడ్డిది జేసీబీ ప్రభుత్వం: నారా లోకేశ్​

ABOUT THE AUTHOR

...view details