ఇకమీదట ఆర్థిక క్రమశిక్షణ, నికరమైన రాబడులు, వంద శాతం పన్ను వసూలు వంటి అంశాల ప్రాతిపదికన రాష్ట్రంలోని మరో 12 నగరపాలక సంస్థలు, 8 పురపాలక సంఘాలు స్వతంత్రంగా క్రెడిట్ రేటింగ్‌ను రూపొందించుకోనున్నాయి. ఫిబ్రవరి నాటికి రేటింగ్ సిద్ధం చేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో బాండ్లను వేలం వేయడం ద్వారా రుణాన్ని సమీకరించుకోనున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఆర్థిక స్థితి, పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక, పన్నుల రాబడి, రాబడి అంచనాలు, ఆర్థికాభివృద్ధి, నిధుల వినియోగం, మౌలిక సదుపాయాలు, సహా వివిధ అంశాల ప్రాతిపదికన క్రిసిల్, ఐసీఆర్‌ఏ, ఫిచ్ వంటి స్వతంత్ర సంస్థలు క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.
ప్రభుత్వంపై ఆధారపడకుండా..
నగరపాలికలు, పురపాలక సంఘాలు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధుల సమీకరణకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. అభివృద్ధి పనులకు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగానే సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
మంత్రి కేటీఆర్ పర్యవేక్షణ