పురపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. జూన్‌లోగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సన్నాహకాలను ప్రారంభించింది. అందులో భాగంగా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసింది. 75 పురపాలికల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2019 జనవరి 1 అర్హత తేదీతో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల పేర్ల ఆధారంగా పురపాలికల ఎన్నికల కోసం జాబితాలు సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.
ఈ నెల 16న ముసాయిదా విడుదల చేసి.. అభ్యంతరాలు, వినతులను 20లోగా స్వీకరించాలని తెలిపింది. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో భాగంగా 18న జిల్లా స్థాయిలో, 19న మున్సిపాలిటీ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. అభ్యంతరాలు, వినతులను పరిష్కరించి వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా మార్చి 27వ తేదీన ప్రకటించాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఆ తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు మార్పులు, చేర్పులను ఈఆర్వోల నుంచి మున్సిపల్ కమిషనర్లు తీసుకొని జత చేయాలని తెలిపింది.
పురపోరుకు కసరత్తు
రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జూన్‌లోగా పుర ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నాహకాలు ప్రారంభించింది.
పురపాలక ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభం
ఇవీ చదవండి: 'జోరందుకున్న ప్రచారం'