ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, వైకాపా 50 సీట్లకే పరిమితమవుతుందని.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఐవీఆర్ఎస్ (IVRS) పద్ధతిలో తాను చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. నరసాపురంలో సీఎం జగన్ పోటీ చేస్తే... ఆయన కంటే 19 శాతం ఆధిక్యం తనకే లభిస్తుందన్నారు. జిల్లాల వారీగా జయాపజయాల వివరాలు ఈ సర్వేలో వెల్లడైనట్లు రఘురామ చెప్పారు.
వైకాపా, కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుందో సర్వేలో తెలిసింది. చిత్తూరులో చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, చంద్రబాబుకు 60 శాతం ప్రజల మద్దతు ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో నేతలు ప్రజల మద్దతు పొందలేకపోతున్నారు. గ్రంధి శ్రీనివాస్‌కు మాత్రమే 50 శాతం పాజిటివిటీ ఉంది. కొందరు చేసే తప్పుడు ప్రచారం ఆపేందుకే తన సర్వే వివరాలు వెల్లడించా.- రఘురామ, నరసాపురం ఎంపీ