తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ చట్టాలపై కేసీఆర్​ ఇప్పుడే నిద్ర లేచారా: ఎంపీ సీఎం

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు బంద్‌కు మద్దతు పలకడాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఖండించారు. చట్టాలపై మొన్నటిదాకా పెదవి విప్పని కేసీఆర్​.. ఇప్పుడే నిద్రలేచారా అని ఎద్దేవా చేశారు. భాజపా విజయాలతో తెరాసకు వణుకుపుట్టి బంద్‌కు మద్దతు పలుకుతోందని శివరాజ్‌సింగ్ విమర్శించారు. చట్టాలపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

mp cm shivraj singh chouhan ask the KCR on agricultural acts
ఆ చట్టాలపై కేసీఆర్​ ఇపుడే నిద్ర లేశారా: ఎంపీ సీఎం

By

Published : Dec 8, 2020, 5:06 AM IST

కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్‌ విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రైతుల హితం కోసం ఏ పీఎంసీ మోడల్ యాక్ట్​ను తమతమ రాజ్యాల్లో అమలు చేయాలని పట్టు పట్టిన పార్టీలు.. ఇపుడు రైతులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాయని శివరాజ్ అన్నారు.

రైతు చట్టాలపై మొన్నటిదాకా పెదవి విప్పని.. సీఎం కేసీఆర్​ ఇపుడే నిద్ర లేశారా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో భాజపా విజయాలతో వణుకుపుట్టి.. భారత్ బంద్​కు తెరాస మద్దతు పలుకుతోందని శివరాజ్ సింగ్ విమర్శించారు. రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం కాంగ్రెస్ నైజం అని, ఏపీఎంసీ చట్టాలను వ్యతిరేకిస్తోన్న పార్టీలు స్టాండింగ్ కమిటీలో ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలను ఎన్డీయే ప్రభుత్వం రైతుల హితం కోసమే తీసుకొచ్చిందన్నారు. వాటిపై చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :భారత్‌బంద్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమైన తెరాస

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details