తెలంగాణ

telangana

టీఎస్​-బీపాస్​ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి కేటీఆర్​

By

Published : Sep 14, 2020, 12:15 PM IST

Updated : Sep 14, 2020, 12:30 PM IST

తెలంగాణలోని పురపాలక పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతులకు టీఎస్‌-బీపాస్‌ విధానం అమలుకోసంబిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​లో వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీ ఆమోదం తెలిపిన కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన నాలుగు బిల్లులపై శాసనపరిషత్తులో సోమవారం చర్చించనున్నారు.

minitster ktr tweet on introducing ts bpass bill in assembly
టీఎస్​-బీపాస్​ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి కేటీఆర్​

రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతులకు టీఎస్‌-బీపాస్‌ బిల్లును మంత్రి కేటీఆర్​ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సులభంగా, సత్వరంగా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడమే లక్ష్యంగా పురపాలకశాఖ టీఎస్​- బీపాస్ విధానాన్ని రూపొందించినట్లు మంత్రి ట్విటర్​ వేదికగా వెల్లడించారు.

బిల్లు ముఖ్యాంశాలు

  • 75 చదరపు గజాల (63 చదరపు అడుగులు) వరకు ఒక అంతస్తు వరకు ఎలాంటి నిర్మాణ అనుమతి అవసరం లేదు. ఇలాంటి భవనాలను ఒక రూపాయి రుసుం చెల్లించి విధిగా టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • పది మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకునే వ్యక్తిగత భవనాలకు పురపాలక కార్యాలయాలకు వెళ్లకుండా స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్‌లైన్‌లోనే నిర్మాణ అనుమతులు పొందవచ్చు.
  • పది మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మించుకునే వారు.. అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసి రుసుం చెల్లిస్తే 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతి వస్తుంది.
  • 21 రోజుల్లో అనుమతి రానిపక్షంలో, వచ్చినట్లుగానే భావించి దరఖాస్తుదారులు ముందుకు వెళ్లవచ్చు.
  • సరళమైన విధానం, స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆమోదాలు జరగనున్నాయి. ఈ విధానంలో పౌరులు, అధికారుల మధ్య ముఖాముఖి పరిచయాలు ఉండనందున ప్రతిదీ పారదర్శకంగా జరనుంది.
Last Updated : Sep 14, 2020, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details