అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టిబడి ఉందని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరిష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలో మండుటెండల్లోనూ వాగులు మత్తడి దూకుతున్న దృశ్యాలను చూస్తున్నామని... ఆర్థికశాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధికి ఇదే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో... సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ ప్రాంతాలకు గోదావరి జలాలు అందిస్తామని హరీశ్ అన్నారు.
అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి: మంత్రులు - Telangana Labor Welfare Board Chairman Devender Reddy
లోయర్ ట్యాంక్ బండ్‌లోని పింగళ వెంకటరామణరెడ్డి హాల్‌లో తెలంగాణ లేబర్ వెల్ఫెర్ బోర్డ్ ఛైర్మన్‌గా దేవేందర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్, కొప్పుల, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి: మంత్రులు
రాష్ట్ర అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత బోర్డు ఛైర్మన్‌గా... ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన హరీశ్‌రావు... పార్టీని వీడకుండా సేవ చేసే ప్రతి కార్యకర్తకు కాస్త ఆలస్యమైనా గౌరవం దక్కుతోందని అన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేయని అభివృద్ధిని... ఏడేళ్లలో తెరాస చేసి చూపించిందని అన్నారు.
- ఇదీ చదవండి :చిన్నతనంలో తీసుకునే ఆహారంతోనే రోగనిరోధక శక్తి