తెలంగాణ

telangana

ETV Bharat / state

'రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఖర్చు చేశాం' - telangana

రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఇప్పటికే దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి ప్రశాంత్​రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.

minister vemula prashanth reddy spoke road development in telangana
'రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఖర్చు చేశాం'

By

Published : Mar 11, 2020, 11:07 AM IST

రవాణామార్గాలే అభివృద్ధికి చిహ్నమని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శాసనసభలో అన్నారు. గత ఆరేళ్లలో రహదారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఇప్పటికే దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. మొత్తంగా 7 వేల 450కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల నిర్మాణం చేపట్టామని ప్రశాంత్​ రెడ్డి పేర్కొన్నారు.

అన్ని మండల కేంద్రాలకు రెండు వరసల రహదారులు నిర్మిస్తున్నామన్నారు. వాగులపై వంతెనల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో 400కు పైగా వంతెనల నిర్మాణం చేపట్టామన్నారు. నదులపై రూ.984 కోట్లతో 24 భారీ వంతెనల నిర్మాణం చేపట్టామని మంత్రి ప్రశాంత్​రెడ్డి స్పష్టం చేశారు.

'రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఖర్చు చేశాం'

ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస

ABOUT THE AUTHOR

...view details