తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్ సారూ, తలసాని సారూ... సల్లంగా ఉండాలి' - Hyderabad latest news

హైదరాబాద్​ బన్సీలాల్​పేట డివిజన్ ఈశ్వరమ్మ లెన్​బస్తీ మహిళలు మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను సన్మానించారు. వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Minister Talsani Srinivas Yadav was honored by the women at  Bansilal Peta, Hyderabad
'కేసీఆర్ సారూ, తలసాని సారూ... సల్లంగా ఉండాలి'

By

Published : Nov 7, 2020, 8:31 PM IST

''కష్టాలలో ఉన్న తమను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ సారూ... సల్లంగా ఉండాలి... మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచే మంత్రి తలసాని సారూ సల్లంగా ఉండాలి....'' అని బన్సీలాల్​పేట డివిజన్ ఈశ్వరమ్మ లెన్​బస్తీ మహిళలు ఆశీర్వదించారు.

భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినందుకు ఈశ్వరమ్మ లెన్​కు చెందిన మహిళలు శనివారం వార్డ్ మెంబర్ సుధాకర్ ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details