రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఏర్పాటు చేసిన 'రోడ్ కమ్ రివర్ క్రూజ్' టూర్ బస్సును బషీర్బాగ్లోని కేంద్ర పర్యాటక కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో మాదిరి మన రాష్ట్రంలో కూడా అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయని పేర్కొన్నారు. త్వరలో సోమశిలకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ భూపతి రెడ్డి, ఎండీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
సాగర్ బస్సు యాత్రను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
పర్యాటక రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఏర్పాటు చేసిన 'రోడ్ కమ్ రివర్ క్రూజ్ బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
సాగర్ బస్సు యాత్రను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్