తెలంగాణ

telangana

ఎక్సైజ్​శాఖ పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొత్త పోస్టులు!

By

Published : Sep 1, 2020, 11:26 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 2005లో జరిగిన ఎక్సైజ్​శాఖ పునఃవ్యవస్థీకరణ తర్వాత తెలంగాణకు జరిగిన లాభం ఏమీ లేదని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ పేర్కొన్నారు. పునఃవ్యవస్థీకరణ జీవో గురించి.. పలు మార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లడం వల్లనే కొత్త పోస్టుల మంజూరుకు అంగీకరించారని మంత్రి తెలిపారు.

minister srinivas goud on excise department re organisation
ఎక్సైజ్​శాఖ పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొత్త పోస్టులు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 2005లో జరిగిన ఎక్సైజ్​ శాఖ పునఃవ్యవస్థీకరణ... ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పుడు మళ్లీ జరిగిందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ తెలిపారు. 2005 నుంచి అవసరాలకు అనుగుణంగా పోస్టులను సృష్టించుకుంటూ వచ్చారని.. వాటివల్ల తెలంగాణకు జరిగిన లాభం ఏమీ లేదని మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమీక్ష సమావేశాల సందర్భంగా పలుమార్లు పునఃవ్యవస్థీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

రాష్ట్ర విభజనలో 41.68 శాతం ఉద్యోగులు కేటాయింపు జరిగిందని.. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతుల్లోనూ అన్యాయం జరిగిందని సీఎం దృష్టికి తీసుకెళ్లడం వల్లనే కొత్త పోస్టుల మంజూరుకు అంగీకరించారని తెలిపారు. పునఃవ్యవస్థీకరణ జీవోలో సూక్ష్మస్థాయిలో ఆబ్కారీశాఖ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ స్థాయిలో పోస్టులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details