తెలంగాణ

telangana

ETV Bharat / state

Srinivas goud: ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలకు అనుమతి: శ్రీనివాస్ గౌడ్

బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పండుగని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అక్టోబర్‌ 6 నుంచి 13 వరకు ప్రభుత్వ ఉద్యోగినులు రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలను కార్యాలయాల్లో నిర్వహించుకోవచ్చని తెలిపారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటలను మంత్రి ఆవిష్కరించారు.

Srinivas goud
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

By

Published : Oct 5, 2021, 5:06 AM IST

బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. అక్టోబర్‌ 6 నుంచి 13 వరకు ప్రభుత్వ ఉద్యోగినులు కార్యాలయాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చామన్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటలను రవీంద్రభారతి కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం మహిళలకు పెద్దపేట వేస్తోందని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు, ప్రభుత్వ ఉద్యోగినులు కార్యాలయాల్లోనే బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవచ్చని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ సంబరాలు ఎంతో ఉత్సాహన్నీ ఇచ్చాయన్నారు. జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కృషితో ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలు విస్తరించాయన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, టీజీవో కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రెటరీ కె. రమేష్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించిన ఈ బతుకమ్మ పాటలకు సింగర్స్ శృతి, వీణా, సితార నవీన్, నాగదుర్గ ఆడి పాడారు.

ఇదీ చూడండి:బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి సందడి..

ABOUT THE AUTHOR

...view details