తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సత్యవతి

వెంగళ్‌రావు నగర్‌ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులను మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆమె అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని పేర్కొన్నారు.

minister-satyavathi-rathod-inaugurates-development-works-in-vengal-rao-division
పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం: సత్యవతి

By

Published : Dec 19, 2020, 2:02 PM IST

రాష్ట్రంలో అంగన్వాడీలోని పిల్లలకు అత్యుత్తమమైన పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర గిరిజన, మహిళ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. శనివారం స్థానిక వెంగళ్‌రావు నగర్ డివిజన్‌లోని మధుర నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని... పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. సుమారు రూ.58 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, ప్రహారీ గోడ, పౌష్టికాహారం లభించే పండ్లు, కూరగాయలు సాగు చేయడానికి ఏర్పాటు చేసిన భూమిని ప్రారంభించారు.

రానున్న రోజుల్లోనూ పేద పిల్లలకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని పథకాలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శిశు సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కళ్లు తిప్పుకోలేని అందాలు.. కైపెక్కించే క్యాట్​వాక్​లు

ABOUT THE AUTHOR

...view details