తెలంగాణ

telangana

ETV Bharat / state

Sabitha on OMC case: గడువు కోరిన మంత్రి.. ఓఎంసీ కేసు విచారణ వాయిదా - ఓఎంసీ కేసులో సబితా ఇంద్రారెడ్డి

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో అభియోగాల నమోదుపై వాదనలకు మరింత సమయం కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఈ కేసులో తన పేరు తొలగించాలంటూ మంత్రి ఇప్పటికే డిశ్ఛార్జ్​ పిటిషన్​ దాఖలు చేశారు. దీంతో ఓఎంసీ కేసు విచారణను ఆగస్టు 2కు హైదరాబాద్​లోని నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

Sabitha on OMC case
ఓఎంసీ కేసులో మరింత గడువు కోరిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

By

Published : Jul 27, 2021, 7:20 PM IST

హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో ఇవాళ ఓబుళాపురం గనుల కేసుల విచారణ జరిగింది. ఈ కేసులో అభియోగాల నమోదు, డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయం కోరారు. కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయగా... ప్రస్తుత దశలో కేసు నుంచి తొలగించవద్దని.. ఆమె ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. డిశ్చార్జ్ పిటిషన్​తో పాటు కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సబిత సమయం కోరడంతో విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలని కోరుతూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై కూడా విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది.

సీబీఐ కౌంటర్​ దాఖలు

ప్రస్తుత దశలో కేసు నుంచి పేరును తొలగించవద్దని.. ఆమె ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. దీంతో డిశ్చార్జ్ పిటిషన్‌తో పాటు కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సబిత సమయం కోరడంతో విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 2కి వాయిదా వేసింది. అలాగే కేసు నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ ఐఏఎస్​ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పైనా విచారణను కూడా ఆగస్టు 2కు వాయిదా వేసింది.

పేరు తొలగించాలని మంత్రి పిటిషన్​

జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల శాఖ మంత్రిగా ఉన్న తనను పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్​లో సీబీఐ అనవసరంగా ఇరికించిందని పిటిషన్​లో మంత్రి పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది.

ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు

తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఇందూటెక్​జోన్​ అభియోగపత్రం నుంచి తన పేరును తొలగించాలని ఇదివరకే మంత్రి సబితా సీబీఐ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జి పిటిషన్​ దాఖలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థే తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించిందని ఆమె పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Indu Tech Zone: ఇందూ టెక్​జోన్ అభియోగపత్రం నుంచి పేరు తొలగించండి: సబిత

SABITHA: జగన్​ అక్రమాస్తుల కేసులో సబిత డిశ్చార్జ్​ పిటిషన్​

ABOUT THE AUTHOR

...view details