Minister Niranjan Reddy: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. పండిన పంటను బాధ్యత ప్రకారం కొనుగోలు చేయకుండా తిప్పలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదేనని వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానికి సంక్రమించిందని పేర్కొన్నారు. యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కొనాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందని మంత్రి విమర్శించారు. పంజాబ్, తెలంగాణలో ఒకేలా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.
అవహేళన చేసేలా మాట్లాడారు..
పంజాబ్‌లో ఒకే సీజన్‌లో ధాన్యం పండిస్తారన్న నిరంజన్‌రెడ్డి.. రెండో సీజన్‌లో గోధుమలు పండిస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. రాష్ట్రాన్ని, ప్రజలను పీయూష్‌గోయల్ అవహేళన చేసేలా మాట్లాడారని ఆగ్రహించారు. ఈ విషయంపై అందరూ సీఎంలు, శాస్త్రవేత్తలను పిలిచి చర్చ పెట్టాలన్నారు. తమ కంటే ముందే మీడియా వద్దకు వెళ్లి పీయూష్ గోయల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తానొస్తే రైతులను ఉద్ధరిస్తామని.. మోదీ గుజరాత్ సీఎంగా చెప్పినవే తాము ఇప్పుడు ప్రస్తావిస్తున్నామన్నారు.
పైసా ఇవ్వకుండా మాపైనే అభాండాలా..
తెలంగాణ వినతిపై కేంద్రం స్పందించలేదు. కేసీఆర్ సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వమా?.. ఎందుకో చెప్పాలి. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?. సాగునీరు ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?. పండిన పంట కొనకుండా ఇబ్బందులు పెడతారా. పంట పెట్టుబడికి పైసా ఇవ్వకుండా మాపైనే అభాండాలా. గోదాముల్లో మురిగిపోతున్న ధాన్యాన్ని పేదలకు పంచవచ్చు కదా. -సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
భాజపానే పెంచాలని చెప్పింది..