Minister KTR will Inaugurate Kothaguda Flyover : నూతన సంవత్సర కానుకగా ఇవాళ ఉదయం కొత్తగూడ పైవంతెనను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ.263 కోట్లతో కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు 2,216 మీటర్ల పొడవుతో పైవంతెన నిర్మాణం చేపట్టారు. నగరవాసులకు సిగ్నల్ రహిత రవాణావ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎస్సార్డీపీ కింద జీహెచ్ఎంసీ ఆ నిర్మాణం చేపట్టింది.
నగర వాసులకు మంత్రి కేటీఆర్ న్యూ ఇయర్ కానుక.. ఏంటంటే..? - మంత్రి కేటీఆర్
Minister KTR will Inaugurate Kothaguda Flyover : భాగ్యనగరానికి మరో మణిహారం రానుంది. కొత్తగూడలో ఫ్లైఓవర్‌ను నూతన సంవత్సరం కానుకగా ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పైవంతెనతో కొత్తగూడ నుంచి గచ్చిబౌలి మధ్య ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది.
కొత్తగూడ గచ్చిబౌలి ప్రధాన పైవంతన 2,216 మీటర్ల పొడవు కాగా.. అందులో ఎస్ఎల్ఎన్ టెర్మినల్ నుంచి బొటానికల్ జంక్షన్‌వరకు 5 లేన్ల వెడల్పుతో.. బొటానికల్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్ వరకు 6 లేన్ల వెడల్పు, కొత్తగూడ జంక్షన్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు 3 లేన్ల వెడల్పు రోడ్డుతో ఫ్లైఓవర్‌ను పూర్తి చేశారు. బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల మధ్య చాలా తక్కువ దూరంలో ఉన్న కూడళ్ల నుంచి సాఫీగా వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ కారిడార్‌కు ఇరువైపులా వాణిజ్య పరమైన నిర్మాణాలకు ప్రయోజనం కలుగుతుంది. ఆ జంక్షన్ పరిసరాల్లో అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నందున.. రద్దీ సమస్య తొలగిపోనుంది.
ఇవీ చదవండి: