తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యం : కేటీఆర్​ - ఫుడ్ ప్రాసెసింగ్

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతిపాదనలపైన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల వారీగా పరిశ్రమలు, ఐటీశాఖల గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలు ఒకే చోట కాకుండా.. వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Minister KTR
మంత్రి కేటీఆర్‌

By

Published : Jun 30, 2021, 10:21 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. అందుకు అనుగుణంగా పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలపైన సంబంధిత అధికారులతో కేటీఆర్​ సమీక్ష నిర్వహించారు. ఆయా రంగాల వారీగా వచ్చిన ప్రతిపాదనల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని అధికారులు మంత్రికి వివరించారు. పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలిపాయని చెప్పారు.

ప్రతిపాదిత పెట్టుబడులను వివిధ జిల్లాలకు తరలించేలా ఆయా కంపెనీలను కోరాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి అందించారన్న మంత్రి.. అటువంటి ప్రాంతాలకు పెట్టుబడులు తరలి వెళ్లేలా ప్రయత్నించాలని వారికి సూచించారు.

ఇదీ చదవండి: Zonal line clear: జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదం

ABOUT THE AUTHOR

...view details