కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలో తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రగతి కోసం తెరాస సర్కార్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్న మంత్రి.... జీహెచ్ఎంసీ ఓటర్ల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్... బల్దియా ఎన్నికల్లో సామాజిక సమతూకం పాటిస్తూ సీట్లు ఇచ్చామని వివరించారు.
ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలే తేల్చుకోవాలి: కేటీఆర్
హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన భాజపాపై విమర్శలు గుప్పించారు. కేంద్రం... తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు.
ఎలాంటి హైదరాబాద్ కావాలి? ప్రజలే తేల్చుకోవాలి: కేటీఆర్
అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్ కావాలా? నిత్యం ఘర్షణలతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలా? ప్రజలు తేల్చుకోవాలని కేటీఆర్ కోరారు. భాజపా ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
ఇదీ చూడండి:'తెరాస చేసిన అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేయండి'