ప్రాణకోటికి అనూకూలంగా ఉన్న ఏకైక గ్రహమైన భూ గ్రహాన్ని సంరంక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. అందరికి ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జీవ వైవిధ్యం కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని, లేకపొతే కరోనా లాంటి వైరస్లు అనేకం అనుభవంలోకి వస్తాయని చెప్పారు.
జీవ వైవిధ్యం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది: ఇంద్రకరణ్ రెడ్డి
జీవ వైవిధ్యం కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని, లేకపొతే కరోనా లాంటి వైరస్లు అనేకం అనుభవంలోకి వస్తాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అందరికి ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జీవ వైవిధ్యం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది: ఇంద్రకరణ్ రెడ్డి
పర్యావరణ విధ్వంసం మూలాన గతంలో ఎబోలా, మెర్స్, నిఫా, సార్స్, బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు వచ్చాయని తెలిపారు. భూమిపై ఉన్న జీవరాశులు మనిషి లేకుండా బతుకుతాయని, కానీ మనిషి జీవరాశులు లేకుండా మనుగడ సాధించలేడని వివరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి విరివిగా మొక్కలు నాటాలన్నారు.
ఇదీ చదవండి:12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు